BRS: సెల్ఫ్ గోల్ కొట్టిన కౌశిక్ ..ఇరకాటంలో బిఆర్ఎస్..!

BRS paty: తెలంగాణలో కౌశిక్ రెడ్డి – అరికె పూడి గాంధీ ఇష్యూ తో బిఆర్ఎస్ ఇమేజ్ నూ మరింత డ్యామేజ్ చేసిందా? ఈ వివాదంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా? ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలని కేసిఆర్ పార్టీ నేతలను అదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

తెలంగాణలో రెండు మూడు రోజులుగా కౌశిక్ రెడ్డి- అరికపూడి గాంధీ మధ్య నడిచిన డైలాగ్ వార్ అగ్గి రాజేసింది. ఇష్యూ కాస్తా డైవర్ట్ అయ్యి తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని సెటిలర్లు బిఆర్ఎస్ పార్టీ పై అసహనాన్ని వ్యక్తం చేశారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈ ఇష్యూ ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రహించిన కేసిఆర్ దిద్దుబాటి చర్యలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హరీష్ రావు- కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అంటూ ఏక వ్యాఖ్యంతో ముగించారని తెలుస్తోంది.

మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే అదనుగా విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయమా?కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేసిఆర్ సమర్థిస్తున్నారా? అనే డిమండ్లను తెరపైకి తెచ్చింది.

మొత్తం ఎపిసోడ్ లో కౌశిక్ రెడ్డి దూకుడు బిఆర్ఎస్ పార్టీకి ప్రతి బంధకంగా మారిందనడంలో సందేహం లేదు. కాకపోతే ఎలాంటి సమస్యనైనా టాకిల్ చేయగల సమర్ధుడైన కేసీఆర్ తన మేధావి తనంతో ఇష్యును డైవర్ట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

Optimized by Optimole