BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..

కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్): 

పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని కృష్ణారావును పట్టించుకోలేదు. ఇప్పుడేం జరిగిందో చూశారు కదా.

అప్పుడు తెరాస చేసింది కదా ఇప్పుడు మేము చేస్తే తప్పా అని అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే తెరాస తప్పులు చేసింది కాబట్టే మీరు ఒప్పులు చేస్తారు అని నమ్మి ప్రజలు ఓటు వేశారు ఇప్పుడు మీరు అదే చేస్తే అప్పుడు మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు చెప్పుతో కొట్టుకుంటారు.

కాంగ్రెస్ పార్టి తెరాస పార్టీలాగే పాలిస్తుంది అంతకన్నా దరిద్రంగా పాలిస్తుంది కేవలం అధికారమే లక్ష్యంగా హామీలు ఇచ్చింది నెరవేర్చదు అని తెలుసు. అయినా కెసిఆర్ ఆరోగ్యాన్స్ వలన ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల్లో ఒక విధమైన కోపం ఆక్రోశం వచ్చినందు వల్ల కాంగ్రెస్ కు 64 సీట్లు ఇచ్చారు. ఏ మాత్రం కొంచెం విచక్షణ కెసిఆర్ వాడినా ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే మనిషి కోర్ లక్షణాలను ఎవరూ మార్చలేరు.

ఇప్పుడు తెరాస నుండి ఎంతమంది బయటికి పొతే అంత లాభం తెరాస కు కలుగుతుంది. కొత్తవాళ్లు ఆశ ఉండేవాళ్ళు ఉత్సాహం ఉండేవాళ్ళు రెండవ మూడవ తరగతి నాయకులు బయటికి వస్తారు. పార్టీకోసం పని చేస్తారు. ఇప్పుడు పోయేవాళ్లంతా అనుభవించి పోయేవాళ్లు. వాళ్ళు ఉన్నా కూడా పార్టీకి వాళ్ళు చేశేది ఏమి ఉండదు వాళ్ళ వలన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు.

ప్రాంతీయ పార్టీలు నాయకుడివలన గెలుస్తాయి ఓడిపోతాయి. వీళ్లంతా అంత బలమైన నాయకులు అయితే పార్టీ ఓడిపోయేది కాదు. వాళ్ళు ఇప్పుడు ఉండడం వలన పార్టీకి కలిగే మేలు ఏమి లేదు. నాలుగేళ్లు ఆగితే మీరు ఏమి చేయకున్నా కాంగ్రెస్ పార్టీయే ఓడిపోతుంది ఎందుకంటే మీరు చేసిన తప్పులు చేస్తూ మీ కన్నా మూడు రెట్లు ఇచ్చిన హామీలను అది ఎలాగూ అమలు చేయలేదు ఈ విషయం ఇప్పటికే అర్థం అయింది. మీరు చేయవలసింది రోజు ప్రజలతో మాట్లాడడం మీడియాలో ఉండడం అది చాలు.

Optimized by Optimole