కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

ఉప్పల్ వేదికగా కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు భారత యువ ఆశాకిరణం శుభ్ మన్ గిల్. ఫస్ట్ ఆఫ్ క్లాస్.. సెకండ్ ఆఫ్ మాస్ తరహలో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఆత్మవిశ్వాసంతో డబుల్ సెంచరీ(208) బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అనేక రికార్డులను కొల్లగొట్టాడు. ఇక ఉత్కంఠగా బరితంగా…

Read More

జాతీయ పాలసీ లేని పార్టీకి.. ఆహా..ఓహో..

గత వారం రోజులుగా ప్రధాన తెలుగు ప్రతికలు, టెలివిజన్ ఛానళ్లలో  బిఆర్ఎస్ ఆవిర్భావ సభ పై ఒకటే ఊదరగొట్టే వార్తలు. ఆహా.. ఓహో..బ్రహ్మాండం బద్దలై పోతుంది.. ప్రధాని మోదీని పడగొట్టేందుకు.. మొనగాడు.. దేశ్ కీ నేత’..కేసిఆర్ సమర శంఖం పూరించబోతున్నాడు..అంటూ కారు పార్టీ నేతలు చేసినా హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకంటారా.. బిఆర్ఎస్ ఆవిర్భావ సభ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చింది.  అంతన్నాడు ఇంతన్నాడో గంగారాజు.. తరహాలో.. జాతీయ…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం తథ్యం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. 12నుంచి 14  శాతం కంటే ఎక్కువ మెజారిటీతో.. ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు  టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన.. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. ఉత్తరాంధ్ర లో…

Read More

ఉరికిచ్చి కొడతాం… “ప్రశ్నిస్తే వదలం’..

  వేములవాడ అనంగనే దక్షిణ కాశీగా పేరు ఉండే. ఎప్పుడు సందడిగానే ఉంటది. ఓ దిక్కు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు. ఏవల భక్తి వాళ్లది. ఎవల బాధలు వాళ్ళయి. చెక్కపల్లి చౌరస్తా దాటి కొంచెం ముందుకు పోతే లడ్డు హోటల్. ఎప్పుడో రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన కుటుంబం. ఇప్పుడు లడ్డు హోటల్ కూడా వేములవాడ జనజీవనంలో భాగమైపోయింది. లడ్డు హోటల్ లో కూసోని మావోడు ఆనంద్ కోసం ఎదురుచూస్తున్నా. వాడు విలేఖరి…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల పోరు …

ఎన్నికలకు ఏడాది ముందరే  పొత్తుల పొద్దు పొడుస్తోంది. రణానికి నగారా ‘రణస్థలం’ నుంచి మోగించారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌! ఎన్నికలకు ఇంకా పదహారు నెలల కాలం ఉంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన ‘యువశక్తి’ సభావేదిక నుంచి, ఒంటరి పోరుకు బలం చాలదనే పొత్తుకు సన్నద్దమౌతున్నట్టు పవన్‌ ప్రకటించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పొత్తుకు మౌలికంగా జనసేన సంసిద్దమే అని సంకేతాలు ఈ వేదిక నుంచి వెలువడ్డాయి. పొత్తు ఏదైనా ‘గౌరవప్రదంగా’ ఉండాలనే ఒక షరతును…

Read More

అంత బుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నడిచేవాణ్ణే: కమల్ హాసన్

Nancharaiah merugumala: …………………………………………. ”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”  ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్…

Read More

చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్

భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్  గట్టిగా బదులిస్తోందన్నారు.  ఇది గమనించిన ప్రపంచ దేశాలు… భారత్  ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్  బలంగా తిప్పికొట్టిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక  గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను…

Read More

రామాయణంలో శంబూకుని వధ ప్రక్షిప్తమా?

రామాయణంలో శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయుచున్నందున ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడని కొందరు ఆరోపించారు. వారి ఆరోపణలు విశ్వసించి శ్రీరాముడు శంబూకుణ్ణి వధించినట్లు ఒక కథ ఉంది. ఇది మూల వాల్మీకి రామాయణంలో ఉన్నదా? లేదా తరువాత ప్రక్షిప్తం చేయబడిందా? అనే విషయాన్ని పరిశీలిద్దాం. శ్రీరాముని యొక్క గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఊర్వశి కొడుకు. ఊర్వశి ఇంద్రలోకంలో నర్తకి. వశిష్ఠుని భార్య అరుంధతి. అరుంధతి మాల. విశ్వామిత్రుడు క్షత్రియుడు. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు వారి కులాలతో…

Read More

రొటీన్ ఫ్యామిలీ డ్రామా ..’ వారసుడు’ రివ్యూ..

తమిళ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘వారసుడు’. కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయక. టాలీవుడ్ ప్రోడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. తెలుగులో కంటే రెండు రోజుల ముందు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తెలుగు వర్షన్ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నిరాశపరిచిందా? కథ: మధ్యతరగతి కుటుంబం నుంచి…

Read More
Optimized by Optimole