 
        
            ఉత్తరాంధ్ర సమస్యలపై సీఎం జగన్ కి మాజీ ఎంపీ కొణతాల లేఖ ..
ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ.. సీఎం జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.‘‘నీళ్లు`నిధులు`నియామకాలు’ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలు..వివక్షత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో జరగడం అత్యంత బాధాకరమన్నారు. ఉత్తరాంధ్ర నుండి ప్రతీ సంవత్సరం లక్షలాది మంది వలసలు పోతున్నారని.. ఒక్క హైదరాబాదులోనే 15 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందిన ప్రజలు వాచ్‌మెన్‌లుగా, చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతున్నట్లు మీడియాలో అనేక కథనాలు వచ్చిన…

 
                         
                         
                         
                         
                         
                         
         
         
         
         
         
         
         
        