గద్దర్ కి కన్నీటి నివాళి!
రాదిరె: శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…