Loksabha2024: బీజేపీ ‘ రామబాణం ‘ అస్త్రం..టార్గెట్ 400 సీట్లు..!
Loksabhaelections2024: లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ తిరిగి పగ్గాలు చేపట్టకుండా కట్టడి చేయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంటే, పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ‘ఇండియా’ కూటమితో బీజేపీకి అడ్డుకట్ట వేయాలనే పట్టుదలతో ఉంది. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ…