గుజరాత్ ఫలితాలపై పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్..!!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలనూ పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసింది. రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను సంస్థ డైరెక్టర్ దిలీప్‌రెడ్డి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లో మరోసారి కమలం వికాసం తథ్యమని ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ స్పష్టం చేసింది. అధికార బీజేపీ 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం…