Maharashtraelections: సామాజికవర్గాల చుట్టూ ‘మహా’సంగ్రామం..!
Maharashtra elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎమ్వీఏ’ కూటముల రాజకీయాలు సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా కులాల చుట్టే తిరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి వెనుదన్నుగా ఉంటున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కులాల ఓట్ల సమీకరణపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఓబీసీ, మరాఠా సామాజికవర్గాల కటాక్షం కోసం పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తూనే, ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే లక్ష్యంగా…