Reservations: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఏడుపు – కొన్ని నిజాలు ..!!

విశీ (వి.సాయివంశీ):    మనకు తెలిసి కొన్నిసార్లు, తెలియక ఇంకొన్నిసార్లు మనలో కొన్ని భ్రమలు పేరుకుపోతాయి. అవే వాస్తవాలు అనిపిస్తాయి. అవి అబద్ధాలని తెలిసినా ఒప్పుకోలేని స్థితికి మనల్ని చేరుస్తాయి. ఆ భ్రమలే నిజాలన్న నమ్మిక మనలో ఏర్పరుస్తాయి. ఏ సామాజిక సర్వేలు చూడక, ఏ సాంఘిక జీవనాన్ని పరిశీలించక ఆ ఊహల్లోనే బతకడం నేర్పిస్తాయి. కానీ నిజం నిప్పు లాంటిది. నివురును చీల్చుకుంటూ బయటికి రాక తప్పదు. సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ జరుగుతోంది….

Read More

Chhatrapati Shivaji: శివాజీ హిందూత్వవాదా? లౌకికవాదా?

విశీ ( సాయి వంశీ) :  (AN IMPORTANT CASE YOU SHOULD KNOW) మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కొల్హార్ ప్రాంతానికి చెందిన గోవింద్ పన్సారేకు తన పాఠశాల ప్రాయంలోనే కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇష్టం, నమ్మకంగా మారింది. 1952లో సీపీఐలో ఆయన చేరారు. ఆపై అనేక పుస్తకాలు చదివారు. ఆ దశలోనే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, గోవా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1962లో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. భారత్-చైనా యుద్ధ సమయంలో…

Read More

Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!

Haryanaelections2024:  ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి…

Read More

DonaldTrump: ట్రంప్‌–వాన్స్‌ జోడీ గెలిస్తే ‘సెకండ్‌ లేడీ’ తెలుగు మహిళ ఉషా చిలుకూరే!

Nancharaiah merugumala senior journalist: నవంబర్‌ 5 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్‌–వాన్స్‌ జోడీ గెలిస్తే అగ్రరాజ్యం ‘సెకండ్‌ లేడీ’ అయ్యేది మన తెలుగు మహిళ ఉషా చిలుకూరే! ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా దేవి హ్యారిస్‌ సగం భారత సంతతి మహిళ అనే విషయం తెలుసు. ఆమె తల్లి తమిళనాడు నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన హిందూ బ్రాహ్మణ డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ అని, తండ్రి జమైకా నుంచి వచ్చి అగ్రరాజ్యాన్ని సొంతూరుగా మార్చుకున్న…

Read More

Indianconstitution: భారత రాజ్యాంగాన్ని ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు!

Nancharaiah merugumala senior journalist: “భారత రాజ్యాంగాన్ని మొదట ఇందిరమ్మ 1977లో గుర్తుచేస్తే..ఇప్పుడు మోదీ ఆ పని చేస్తున్నారు! “ ఇందిరా గాంధీ 11 సంవత్సరాల పాలన తర్వాత, 21 నెలల (కొందరు 19 మాసాలని లెక్కిస్తారు) ఎమర్జెన్సీ అనంతరం…1977 మార్చ్ నెలలో నాటి ప్రతిపక్ష పార్టీలకు భారత రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కుల విలువ ఏమిటో అర్థమైంది. ఇందిరమ్మ పార్టీ నేత కాకపోయినా.. అమె అడుగుజాడలనే ఆదర్శంగా ఎంచుకున్న నరేంద్ర మోదీ దశాబ్ద పరిపాలన అనంతరం…

Read More

Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read More

Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?

సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు‌. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….

Read More

Ayodhya: అయోధ్యలో కమలం ఎందుకు వికసించలేదు?

సాయి వంశీ ( విశీ) :  నిజమే! మొత్తం దేశానికి ఇదొక ప్రశ్న. రామమందిరం కట్టారు, బాలరాముణ్ని ప్రతిష్టించారు, ఊరూవాడా ఏకం చేసి సంబరాలు చేశారు. అయినా అక్కడ కమలం వికసించలేదు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబా‌ద్‌ ఎంపీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ 54,567 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంత భారీ ఆధిక్యంతో విజయం సాధించడం చిన్న విషయం కాదు. అసలు ఏం జరిగింది? కమలలోచనుడు ఎందుకు కమలం మీద శీతకన్నేశాడు? నిజానికి…

Read More

Elections2024: ‘ అక్షర సాక్ష్యం ‘ పీపుల్స్ పల్స్..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా కనిపిస్తూనే వుంది. మా ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ ప్రజాక్షేత్రం నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని సర్వే గణాంకాల రూపంలో కౌంటింగ్ కు ముందే విలేకరుల సమావేశం పెట్టి వెళ్లడించాం. అంతకన్నా స్పష్టంగా ఆర్టికల్స్ రూపంలో…

Read More

Congress: ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి..!

Exitpolls2024:  ” పోల్ బాయకాట్ చేయకుండా… ఎగ్జిట్ పోల్స్ ను బాయకాట్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? ”  ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ ప్రకటించాల్సింది. ఎందుకో అంతటి గొప్ప సాహసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ (జీఓపీ) చేయలేదు. కానీ శనివారం సాయంత్రం అన్ని మీడియా వేదికల…

Read More
Optimized by Optimole