రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!

కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్‌ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్‌ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా… ఇన్నాళ్లు రాహుల్‌ పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు…

Read More

తెలంగాణలో బీజేపీకి అధికారం కలేనా…?

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తున్నామని పగటి కలలుకంటూ క్షేత్రస్థాయిలో వాస్తవికతను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర బీజేపీ ఢల్లీి హైకమాండ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నా ఢల్లీి పెద్దలు మాత్రం వాటిని పూర్తిగా విశ్వసించక ఆచితూచి అడుగులేస్తున్నారు. అందుకే రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా పార్టీ అధిష్టానం రాష్ట్రంలో విడతలవారీగా అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ రాష్ట్ర నాయకులను అప్రమత్తం చేస్తూన్నా ఇక్కడి లీడర్లు మాత్రం పగటికలలతో ఊహాలోకంలో ఉంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ…

Read More

అండర్ -19 ప్రపంచ కప్ విజేత భారత్..

అండర్ -19 ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో.. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ పై గెలిచి భారత మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బ్రిటిష్ జట్టు 68 పరుగులకే కుప్పకూలింది. భారత్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో .. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టారు. కెప్టెన్…

Read More

ప్రచారంలో Hindutva ను దాటిపోతున్న Hindenburg..

Nancharaiah merugumala 🙁 senior journalist) ================== H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ…

Read More

గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..

Nancharaiah merugumala:(senior journalist) =========== గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు..  ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం.. మోహన్‌ దాస్‌ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్‌ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్‌ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో తొలి…

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More

నల్గొండ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వ రావు IPS

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీగా అపూర్వ రావు IPS బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన రెమా రాజేశ్వరి రామగుండం సి.పి గా బదిలీపై వెళ్ళారు. గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం..జిల్లా ఎస్పీ కార్యాలయంలో అపూర్వ రావు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు.. ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పుష్పంగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోగిలయ్య, నల్లగొండ డిఎస్పీ, నరసింహ రెడ్డి,దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర…

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More
Optimized by Optimole