వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే: సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు.రెండుసార్లు ఓటమి పాలైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని  తెలిపారు. తన వెంట ఉన్న నాయకులందరినీ అధికార పార్టీ డబ్బులతో లొంగదీసుకున్నా.. నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. 2014లో పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. నియోజక వర్గ ప్రజలు చూపించిన ఆదరణను  మర్చిపోలేదని సంకినేని గుర్తు…

Read More

ఏరువాక పౌర్ణమి విశిష్టత!

ఏరువాక సాగారో రన్నో చిన్ననా… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..!! తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో…

Read More

7 వ తేదీన పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం: సంకినేని

సూర్యాపేట: తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించిందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పార్టీ ఆదేశానుసారం.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం సంకినేని నివాసంలో నియోజక వర్గ శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఈనెల 7వ తేదీన త్రివేణి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ  పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ…

Read More

హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More

చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

రాజకీయ పార్టీలు నిర్వహించే  ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ  వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని  ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు  పోలీసులు…

Read More

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read More

ఇంట గెలిస్తేనే .. బీఆర్‌‘ఎస్‌’.. లేకపోతే కష్టమే సుమీ..!

కారులో ప్రయాణించాలంటే దాన్ని సామర్థ్యాన్ని బట్టి ప్రయాణికులుండాలి. ఓవర్‌ లోడిరగ్‌ అయితే ప్రమాదం తప్పదు. 2014 కంటే 2018 ఎన్నికల్లో జట్‌స్పీడ్‌గా వెళ్లి బీఆర్‌ఎస్‌ కారు కావాల్సిన మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచి బొటాబొటి మెజార్టీ సాధించిన బీఆర్‌ఎస్‌ కారు, 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో  మరింత వేగవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఈ విజయం కూడా సంతృప్తి ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దనే భావనతో…

Read More

కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీరాజేశ్వరి

నల్లగొండ:  నల్గొండ జిల్లా ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటల నుంచి  స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్ల తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం  జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.   కాగా న్యూఇయర్…

Read More

న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోండి: ఎస్సై రాజశేఖర్ రెడ్డి

నల్లగొండ : కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి సూచించారు  . ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎసై రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు.  ఇక  బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదన్నారు  ఎసై రాజశేఖర్ రెడ్డి. తాగి రోడ్లపై వాహనం నడుపుతూ  న్యూసెన్స్ చేసే వారి పట్ల కఠిన…

Read More
Optimized by Optimole