ముచ్చటేసిన ఆట!
ఆర్. దిలీప్ రెడ్డి( పొలిటికల్, స్పోర్ట్స్ ఎనలిస్ట్, ): ఆటల్లో నాకు నచ్చే అనేకానేక విషయాల్లో… వింబుల్డన్ సెంటర్ కోర్ట్ ప్రేక్షకుల నిమగ్నత ఒకటి. మరచిపోయి మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నట్టు అప్పుడప్పుడు… లయగా కొట్టే చప్పట్లు తప్ప, ఎక్కువ మార్లు నిశ్శబ్దంగా, తదేకంగా అటనే చూస్తుంటారు. లీనమైపోతారు. కూచున్నచోటు నుంచి లేచి తిరిగే కదలికలూ తక్కువే! వారి ఓపికకు మెచ్చుకోవాలి…అత్యధికులు, ఆద్యంతం, ఆనందపు ముఖాలతో ఆటను ఆస్వాదిస్తూవుంటారు. వారిని అలరిస్తూ… ఇవాళ, కార్లస్ ఆల్కరజ్ ఆడిన ఆట…