Telangana: పురపోరు ఆ ముగ్గురికీ సవాలే….!
Telangana: తెలంగాణలో మున్సిపాలిటీలు-మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల పురపోరు ప్రధాన పార్టీలన్నింటికీ సవాలే! వచ్చే అసెంబ్లీ (2028) ఫైనల్ పోరాటానికి ముందు ఇదో క్వార్టర్ ఫైనల్ వంటిది ఒకరకంగా చెప్పాలంటే! ఈ ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్పీటీసీ-జడ్పీటీసీల ఎన్నికల్ని సెమీఫైనల్ పోరుగా పరిగణించవచ్చు. అవీ, ఇవీ కలిస్తే రాష్ట్రంలోని నగర-పట్టణ-గ్రామీణ, అంటే యోగ్యులైన అందరు రాష్ట్ర ఓటర్ల మనోగతం, స్థూలంగా తెలంగాణ జనాభిప్రాయం సేకరించినట్టే లెక్క! నిన్నటి గ్రామ పంచాయతీ (సర్పంచ్-వార్డు సభ్యుల) ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన…
