Literature: కొత్త కథకులు.. రాస్తాం అంటారు కానీ రాయరెందుకు…?
విశీ : కథానిలయం 27వ వార్షికోత్సవంలో ఖదీర్‌గారు కొత్త కథకుల గురించి, కథాసాహిత్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న యువత గురించి చెప్పాక ఆ విషయంపై చాలా చర్చ జరిగింది. చర్చ ఎప్పుడూ మంచిదే! కొత్త విషయాలు తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఈ సమయంలో ఒక్క విషయం చెప్పాలని అనిపిస్తోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగేటప్పుడు, వివిధ కథా వర్క్‌షాప్‌లు నిర్వహించినప్పుడు, ఏవైనా కథా సంకలనాలు విడుదలైనప్పుడు.. వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. అందరూ చాలా ఉత్సాహంతో ఉంటారు….