మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More

సిలిండర్ ధరపై సామాన్య కూలీ పోస్ట్ వైరల్.. నెటిజన్స్ ప్రశంసలు!

గ్యాస్ సిలిండర్ ధరపై ఓసామాన్య కూలీ ప్రశ్నిస్తున్న పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో సిలిండర్ ధరపై.. అధికార టీఆర్ఎస్, కొన్ని పార్టీల నేతలు బాధపడడం చూస్తుంటూ జాలీవేస్తుందంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. సామాన్యునికి ఉన్న ఆలోచన.. నాయకులకు లేకపాయే అంటూ నెటిజన్స్ అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు వైరల్ గా మారిన పోస్టు సారాంశాన్ని పరిశీలిస్తే.. సిలిండర్ ధర పెరిగిందని అధికార టీఆర్ఎస్ నేతలు తెగ…

Read More

బక్రీద్ త్యాగానికి ప్రతీక: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బక్రీద్ పర్వదినం సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి.. ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ సందర్శించి  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందన్నారు ఎమ్మెల్యే .జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని  మానవాళికి ఇస్తుందని…

Read More

తెలంగాణలో బీజేపీ బెంగాల్ తరహా వ్యూహాం..!!

పశ్చిమ బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు చేయనుందా? కమలనాథుల దూకుడు వెనక దాగున్న మర్మం అదేనా? సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్టేందుకు స్కెచ్ రెడీ అయిపోయిందా? సీనియర్ నేత ఈటల రాజేందర్ తాజా ప్రకటన వ్యూహాంలో భాగమేనా? మమతా బెనర్జీ మాదిరి కేసీఆర్ నూ ఓడించడం సాధ్యమేనా?  తెలంగాణలో కమలనాథులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.ఎనిమిది ఏళ్లలో టీఆర్ఎస్ హామీలతో పాటు వైఫల్యాలను…

Read More

తెలంగాణలో సర్వేల కోలాహలం .. నేతల్లో ఉత్కంఠ!

తెలంగాణలో సర్వేల కోలాహలం నడుస్తోంది.ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. క్షేత్రస్థాయిలో పార్టీ బలబలాలను భేరిజు వేసుకుని ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీం..ఇప్పటికే రాష్ట్రమంతా పర్యటించి సర్వే నిర్వహించింది.మరోవైపు బీజేపీ సైతం అదే తరహాలో సర్వే నిర్వహించి..అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అధికార టీఆర్ ఎస్ మూడోసారి…

Read More

తెలంగాణపై మరోసారి పంజావిసురుతున్న కరోనా!

తెలంగాణపై కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత వారం రోజులుగాక కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 608 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు 8 లక్షల 5 వేల 137 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. అటు మహ్మమారి నుంచి 459 మంది కోలుకోగా.. ఆసంఖ్య 7 లక్షల 95 వేల 880 కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

నల్లగొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఉన్న ఆపరేషన్ థియేటర్లు  అందుబాటులోకి వచ్చాయి. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స,  చెవి ముక్కు గొంతులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన  సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.    ఎంతో అనుభవం  నైపుణ్యం కలిగిన డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని…

Read More

తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తోన్న కమలనాథులు!

తెలంగాణలో విజయ సంకల్ప సభ సక్సెస్ తో జోరుమీదున్న కమలనాథులు దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీలను నియమించిన రాష్ట్ర నాయకత్వం.. టీఆర్ ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమాచారం కోరుతూ.. ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమాచారం హక్కు చట్టం కింద ఒకేసారి 88 దరఖాస్తులు చేసి షాకిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో…

Read More

మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్…

Read More
Optimized by Optimole