బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా డోర్లు పగల గొట్టడం, గ్యాస్ కట్టర్లు, రాడ్లు వినియోగించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగరణ చేస్తుంటే.. పోలీసులకు, ప్రభుత్వంకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…