అమ్మాయి – అబ్బాయి ఫైట్ .. వీడియో వైరల్!

ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈఘటన ఢిల్లీ మెట్రోరైలులో జరిగింది.ఇంతకు వాళిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందో తెలియాలంటే ఈక్రింది వీడియో చూడండి!

ఇక వీడియో చూసినట్లయితే.. అమ్మాయి కొనుగోలు చేసిన టీ-షర్టును అబ్బాయి అవమానించడంపై ఇరువురి మధ్య వాదన ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. 1000 రూపాయలు పెట్టి టీషర్ట్ కోన్నానని అమ్మాయి అంటోంది.బదులుగా అబ్బాయి 150 రూపాయలు కంటే విలువైందిగా కనిపించడం లేదంటాడు. ఆమె కోపంతో అబ్బాయి చెంపమీద కోడుతోంది. అతను తిరిగి ఒక దెబ్బ కొడుతాడు. దీంతో ఇద్దరి మధ్య తగువులాట మొదలవుతుంది. “మమ్మీ కో బోలుంగీ మెయిన్” (నేను తల్లికి చెబుతాను) అంటూ ఉక్రోశంతో ఊగిపోతోంది అమ్మాయి.”తేరే జైసా లడ్కా కిసికో నా మైలే” (నీలాంటి వ్యక్తిని ఎవ్వరూ పొందకూడదు) అంటూ అబ్బాయి సమాధానమిస్తాడు. వీరిద్దరి మధ్య తగువులాట మెట్రోనుంచి దిగిపోయేవరకు జరిగినట్లు తెలుస్తోంది. 

 

ఈవీడియో పట్ల ఓ నెటిజన్ నవ్వులు పూయిస్తున్న జంట అంటూ కామెంట్ చేయగా.. చిలిపి అల్లరంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మూడు రోజుల్లోనే వీడియోను లక్షల మంది వీక్షించారు.