దేవర ట్రైలర్ టాక్:
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ రెండు నిమిషాలు 40 సెకండ్ల ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ హంగామా, డైలాగులతో ట్రైలర్ నింపేశాడు దర్శకుడు కొరటాల. ” కులం లేదు మతం లేదు ధైర్యం తప్ప ఏమీ లేదు” …” రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ.. దేవరకథ ” అంటూ వచ్చే డైలాగులు మూవీ కథ నేపథ్యాన్ని తెలిపే విధంగా ఉన్నాయి.
ఇక దేవర సముద్రం నేపథ్యంలో సాగే కథ. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ( పెద్ద దేవర ధైర్యవంతుడు, చిన్న దేవర భయస్తుడిగా)ద్విపాత్రాభినయం పోషించాడు. ప్రతి నాయకుడుగా సైఫ్ అలీ ఖాన్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ గెటప్ లు వెరైటీగా కనిపించాయి. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతుంది. అనిరుద్ బిజిఎం అదిరిపోయింది. మొత్తంగా ట్రైలర్ ఎన్టీఆర్ అభిమానులను అలరించింది.