రాహుల్ ఘండి చిక్కుల్లో పడబోతున్నాడా ?

పార్థ సారథి పొట్లూరి: 

రాహుల్ మామూలుగా కాదు పీకల్లోతు కష్టాలని ఎదుర్కోబోతున్నాడు !

1. రెప్రెసెంటిషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1959 [Representation of the People Act, 1951] ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరన్నా కనుక ఏదేని కోర్టులో దోషిగా నిర్ధారించబడి కనీసం రెండేళ్ళు జైలు శిక్ష కనుక పడి నట్లయితే అతడు /ఆమె పార్లమెంట్ సభ్యత్వం ని కోల్పోతారు !

2. దీనిప్రకారం రాహుల్ తన లోక్సభ సభ్యత్వం ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే హై కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ సూరత్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు మీద స్టే ఇస్తే అక్కడితో ఆగిపోతుంది కానీ హై కోర్ట్ లేదా సుప్రీం కోర్ట్ కింది కోర్టు ఇచ్చిన శిక్షని సమర్ధిస్తే లేదా స్టే ఇవ్వక పోతే మాత్రం లోక్ సభ సభ్యుడిగా అర్హతని కోల్పోతాడు. 

3. హై కోర్ట్ లేదా సుప్రీం కోర్ట్ కనుక స్టే ఇవ్వకపోతే మరో 8 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు రాహుల్ కి. 

4.  అయితే ఈ చట్టానికి మరింత వివరణ ఇస్తూ జులై నెల 10 వ తేదీ, 2013 లో సుప్రీం కోర్టు తన తీర్పుని వెల్లడించింది. 

5. సుప్రీం కోర్ట్ ఇద్దరు సభ్యులు కల ధర్మాసనం లో జస్టిస్ శ్రీ  AK పాట్నాయిక్ గారు [AK Patnaik] మరియు SJ ముఖోహోపాధ్యాయ గార కలిసి తమ తీర్పులో వివరంగా చెప్పారు: ఎవరన్నా MLC,MLA,MP లు కానీ నేరం ఎలాంటిది అయినా సరే రెండేళ్ళు జైలు శిక్ష పడితే ఆయా పదవులకి అర్హత కోల్పోతారు. 

6. ఈ తీర్పు జులై 10,2013 కి ముందు ఎవరన్నా 2 ఏళ్లు శిక్ష పడినవారు ఉన్నా 8 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు ! అంటే 2013 తీర్పు కంటే ముందు ఎవరన్నా శిక్ష పడిన వారు ఉంటే వాళ్ళు కూడా 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదు అన్నమాట !

7. సుప్రీం కోర్టు ఇద్దరు సభ్యుల ధర్మాసనం  రెప్రెసెంటిషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1959 సెక్షన్ 8[4] ప్రకారం శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు మూడు నెలల లోపున లేదా సదరు తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఇచ్చిన గడువు లోగా ఉన్నత న్యాయస్థానంలో అపీల్ చేసుకోవచ్చు కానీ ఉన్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వకపోతే మాత్రం ఆ శిక్ష అమలులోకి వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది !

8. ఇలా చూస్తే టెక్నికల్ గా రాహుల్ తన లోక్ సభ సభ్యత్వం కోల్పోయినట్లే !

మోడీజీ ని మోడీజీ ఇంటి పేరు కల వాళ్ళు అందరూ దొంగలే అన్న రాహుల్ వాఖ్య కి పడ్డ శిక్ష దాని మీద అపీల్ చేసుకొనె అవకాశం ఇచ్చినా మరో పెద్ద కేసుని  రాహుల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

లండన్ వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో  ఉంది అంటూ చేసిన తల తిక్క వ్యాఖ్యలని మన పార్లమెంట్ కమిటీ పరిశీలుస్తున్నది. పార్లమెంట్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ని ఆధారం చేసుకొని లోక్ సభ స్పీకర్ కనుక చర్య తీసుకుంటే దానికి తిరుగు ఉండదు. బహుశా మరో వారం లోపలే లోక్ సభ స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది! ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడింది అంటే అది భారత పార్లమెంట్ ని అవమానించిట్లే!

ఒక సర్వే లో తేలింది ఏమిటంటే లండన్ కేంబ్రిడ్జ్ మరియు హార్వర్డ్ విద్యార్ధులని రాహుల్ గురుంచి మీకు ఏమి తెలుసు అని ప్రశ్నించగా రాహుల్ మహాత్మా గాంధీ మనవడు అనే సమాధానం వచ్చింది ! ఇక ఈ యూనివర్సిటీ విద్యార్ధుల IQ ఎంతలా ఉందో అర్ధం అయిపోవట్లా ?

వీడియొ సాక్ష్యం చెల్లుతుందా ?

1. వీడియొ సాక్ష్యం చెల్లుతుంది కానీ ఆ వీడియొ అసలుదే అని నిర్ధారించాల్సి ఉంటుంది. దీని కోసం సదరు వీడియొ ని ఫోరెన్సిక్ లాబొరేటరీ కి పంపించి ఆ వీడియొ ని ఎలాంటి మార్పులు చేయలేదని సర్టిఫై చేస్తే ఆ వీడియో సాక్ష్యం చెల్లుతుంది. 

2. కర్ణాటక లోని కోలార్ పట్టణం లో రాహుల్ మాట్లాడిన ప్రసంగం ఎలక్షన్ కమీషన్ నియమించిన వీడియొ గ్రాఫర్ తీసింది మరియు దానిని జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ సర్టిఫై చేశారు కాబట్టి ఈ వీడియొ ని ఫోరెన్సిక్ లాబ్ కి పంపించాల్సిన అవసరం ఉండదు కోర్టుకి. హై కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ వీడియొ ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేదు !

3. మరి అక్బరుద్దీన్ ఒవైసీ కేసులో అతనికి ఎందుకు శిక్ష పడలేదు ?

4. అక్బరుద్దీన్ మాట్లాడిన వీడియొ అసలు కాసెట్ ని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకి ఇవ్వలేకపోయింది. ఒరిజినల్ కాసెట్ లు లేవని చెప్పింది కోర్టుకి. కోర్టులు పత్రికలలో వచ్చిన వాటిని కానీ, టివి ఛానెల్స్ లో వచ్చినవి వాటిని కానీ లేదా యూట్యూబ్ ఛానెల్స్ లో వచ్చిన వార్తలని కానీ పరిగణలోకి తీసుకోవు. ఒరిజినల్ కాసెట్ ని కోర్టులో ఇవ్వాలి దానిని కోర్టు ఫోరెన్సిక్ లాబ్ కి పంపి వివరణ కోరుతుంది. మా దగ్గర  ఒరిజినల్ వీడియొ కాసెట్ లు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేతులు ఎత్తిసిన తరువాత కేసు కొట్టేయక తప్పలేదు సదరు న్యాయమూర్తి గారికి !

So ! కోలార్ పట్టణంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల వీడియొ జిల్లా ఎన్నికల అధికారి సర్టిఫై చేసిందే కాబట్టి ఎలాంటి వివాదానికి తావులేదు. నిజానికి హై కోర్టు చూసేదీ రాహుల్ అలా అన్నాడా లేదా అని మరియు ఆ వీడియొ లు వరిజినల్స్ అవునా కాదా అనే రెండే అంశాలని పరిగణ లోకి తీసుకొని తీర్పు చెప్తుంది !

జైహింద్ ! జై భారత్ !

You May Have Missed

Optimized by Optimole