త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..!

‘యంగ్ రెబ‌ల్ స్టార్’ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. వ‌రుస‌ పాన్ ఇండియా సినిమాల‌తో బిజిగా ఉన్న రెబ‌ల్ స్టార్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఖైదీ, మాస్ట‌ర్ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తమిళ‌ ద‌ర్శ‌కుడు లోకేష్ మ‌హ‌రాజ్తో సినిమా చేస్తున‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మ‌హ‌రాజ్ క‌మ‌ల్‌హ‌స‌న్ తో ‘విక్ర‌మ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ తో చేయ‌నున్నార‌ని.. అందుకోసం క‌థ కూడ సిద్ధమైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్, స‌లార్ చిత్రాలలో న‌టిస్తున్నారు. అనంత‌రం ‘మ‌హ‌న‌టి’ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో న‌టించ‌నున్నారు. ఈ మూడు చిత్రాలు పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్‌- లోకేష్ క‌న‌గారాజ్ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. ప్ర‌భాస్ న‌టించిన ‘రాధేశ్యామ్’ చిత్రం ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. బాహుబ‌లి , సాహో చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్ర‌భాస్ తో చిత్రాలు చేయ‌డం కోసం అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌లు ద‌ర్శ‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.