‘రిపబ్లిక్’ రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల!

మెగా మేనల్లుడు సాయి తేజ్ నటిస్తున్న చిత్రం రిపబ్లిక్. జిబి ఎంటర్టైన్మెంట్స్, జి  స్టూడియోస్ పతాకంపై, జి పుల్లారావు , జై భగవాన్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు దేవకట్టా. హీరోయిన్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆమె ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ్ బామ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, హీరో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణి శర్మ బాణీలను అందిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.