కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.
కేరళలోని కొట్టాయంలో మావటి కున్నక్కడ్ దామోదరన్ నాయర్.. గత 6 దశాబ్దాలుగా ఏనుగులను సంరక్షణ చేస్తున్నాడు. అందులో భాగంగా.. పాల్గాట్ బ్రహ్మదత్తన్ ఏనుగును సాకుతున్నడు. స్థానికులు అతనిని ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న కన్నుమూశాడు. అతని మరణవార్త విని గజరాజు పాల్గట్.. 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరి చూపు చూసేందుకు వచ్చింది. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు పిలిచింది. ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆ మావటి కుటుంబ సభ్యుడు ఏనుగును చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో ఆ కుటుంబానికి, ఏనుగుకు మధ్య ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది.
మనసులను కదిలిస్తున్న వీడియో..
ఇందుకు సంబంధించిన వీడియో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు.