Telanganacongress: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఉందని.. ఇతర పార్టీ నేతలను చేర్చుకోవాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంంతాలకు అనుగుణంగా పోరాటం, పని చేయాలని హితువు పలికారు. దీంతో పార్టీ ఫిరాంపులపై జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హస్తంపార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
ఇక తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరికను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆయన చేరికను అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తున్నట్లు.. ఇలాంటి చర్యలను తాను ఎప్పటికీ ప్రోత్సహిత్సనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.