×

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.

1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు  కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?

2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ 9 సంవత్సరాల పాలనలో ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చారు? ఎన్ని నెరవేర్చలేదు? దీనిపైన కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?

3. మీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో 20 వేల కోట్లతో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? తెలంగాణ ప్రజలపట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు?

4. బయ్యారంలో ఉక్కుకర్మాగారం పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు?  దీనిపైన స్పష్టతను ఇస్తారా?

5. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల నిధులను ఎప్పుడు మంజూరు చేస్తారు? ఈ నిధులు 2019 నుండి నిలిపివేయడానికి కారణాలు ఏమిటి?

6. మీరు అధికారం చేపట్టిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అయినా జాతీయో హోదా ఇచ్చారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అయిన పాలమూరు`రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు.

7. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఎటిఎం గా మారిందని విమర్శలు చేసే మీరు, మీ కేంద్రమంత్రులు, మీ పార్టీవారు దీనిపైన సిబిఐ లేదా ఇతర సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదు?  మీకు కేసీఆర్‌కు, బిజెపికి, బీఆర్‌ఎస్‌కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటి?

8. కేంద్రమంత్రిగా శ్రీ కేసీఆర్‌గారు పనిచేసినప్పుడు పాల్పడిన సహారా, ఇ.ఎస్‌.ఐ స్కామ్‌లపై ఎందుకు విచారణ జరిపించడం లేదు? ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

9. 2014 లో మీరు ప్రధానమంత్రి అయినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యాసంస్థలను తెలంగాణలో ఎందుకు నెలకొల్పలేదు? ముఖ్యంగా ఐ.ఐ.ఎం, ఐ.ఎస్‌.ఆర్‌, ఎన్‌.ఐ.డి, ట్రిపుల్‌ ఐటి, నవోదయ విద్యాలయాలు కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ఎందుకు వివక్షత చూపుతున్నారు?

10. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వడం లేదు? బిజెపి పాలిత రాష్ట్రాలకు ఎందుకు ఇస్తున్నారు? దీనిపైన మీ సమాధానం ఏమిటి?

11. తెలంగాణ రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటివాటా కేటాయింపుల విషయంలో ఎందుకు కేంద్రప్రభుత్వం తాత్సర్యం చేస్తోంది? సాగునీటి వాటాల కేటాయింపులపై ట్రిబ్యునల్లకు ఎందుకు రిఫర్‌ చేయడం లేదు?

12. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులను కూడా ఏవో సాకులు చెప్పి ఎందుకు నిలిపివేస్తున్నారు?

13. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు సంభవించినప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాలకు ఈ 9 సంవత్సరాల కాలంలో ఎంత సహాయం అందించారు? తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు?

14. తెలంగాణ రాష్ట్రానికి ఈ 9 ఏళ్ల కాలంలో జాతీయ స్థాయి ఉన్న ఒక్కవిద్యాసంస్థ కానీ, మెడికల్‌ కళాశాలలు కానీ మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారా?

15. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయంను ఎప్పుడు ప్రారంభిస్తారు?

16. తెలంగాణలో అనేక డిఫెన్స్‌ సంస్థలున్నాయి? ఈ రాష్ట్రంలో ఢపిెన్స్‌ క్యారిడార్‌ కేంద్రప్రభుత్వం ఎందుకు మంజూరు చేయడం లేదు?

17. నిజామాబాద్‌ పసుపు బోర్డు ఎప్పటి లోగా ఏర్పాటు చేస్తారు?

18. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికి సంబంధమున్న మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు? మీకు, కేసీఆర్‌కు మ్యాచ్‌ఫిక్సింగ్‌ అయ్యిందా?

19. కర్ణాటక ఎన్నికలు పూర్తయిన తరువాత పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలీండర్‌ ధరలు పెంచనని మీరు హామీ ఇవ్వగలరా? 2014 నుండి ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాల కాలంలో వీటిపైన ఎన్నిసార్లు ధరలు పెంచారు?

20. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతీ ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమచేస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు?

21. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు? ఇప్పటి వరకు ఎన్నికోట్ల ఉద్యోగాలను మీరు అధికారంలోకి వచ్చిన తరువాత కల్పించారు?

22. మీకు, అదానికి ఉన్న సంబంధం గురించి తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? దీనిపైన ఇప్పటికైనా నోరు విప్పుతారా?

23. అదాని పాల్పడ్డ కుంభకోణాల్లో మీ పాత్ర ఉందా? లేదా? ఈ కుంభకోణంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించడానికి మీరు ఎందుకు వెనుకాడుతున్నారు?

24. మీ విద్యార్హతల గురించి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డిగ్రీ సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తీర్పు ఇచ్చిన వ్యక్తి మా తెలంగాణ బిడ్డ. మీరు పాల్గొనే బహిరంగ సభలో మీరు మీ సర్టిఫికేట్‌ను ప్రజల సమక్షంలో చూపడానికి సిద్ధమా? కనీసం మీ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా అయినా మీ సర్టిఫికేట్‌ను షేర్‌ చేయగలరా?

25. 2014 లో మీరు అధికారం చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు? ఎన్ని కొత్తగా ప్రారంభించారు? దీనిపైన వివరణ ఇవ్వగలరా?

26. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌కు మంజూరు అయిన ఐటిఐఆర్‌ (ఇంటిగ్రేటేడ్‌ ఇన్వెస్టిమెంట్‌ టెక్నాలజీ రీజియన్‌) ఎందుకు రద్దు చేశారు? దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న కార్యక్రమాలు ఏంటి?

27. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం సాఫ్ట్‌వేర్‌ రంగానికి పుట్టినిల్లు.  తెలంగాణ రాష్ట్రానికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్టులు ఎందుకు ఇవ్వడం లేదు?

28. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రఖ్యాత ఫార్మాకంపెనీలున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో కూడా తెలంగాణలోని ఫార్మా కంపెనీయే కీలకపాత్ర పోషించిన విషయం మీకు తెలియంది కాదు. అంత ప్రాధాన్యత ఉన్న తెలంగాణకు ఫార్మాసిటిలకు కేంద్రప్రభుత్వం ఎందుకు సహాయం చేయడం లేదు?

29. ట్రెడీషనల్‌ మెడిసన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ నుండి మీ స్వరాష్ట్రమైన గుజరాత్‌కు ఎందుకు తరలించారు?

30. బిజెపి – బీఆర్‌ఎస్‌ ఉన్న లోపాయకారి ఒప్పందాలను మీరు వెల్లడిరచగలరా? మీ కనుసన్నల్లోనే బీఆర్‌ఎస్‌ పార్టీ పనిచేస్తున్నదన్న విషయం వాస్తవం కాదా? బిజెపికి – బీఆర్‌ఎస్‌, ఎఐఎంఐఎం ఇంకా కొన్ని పార్టీలు ‘బి’, మరియు ‘సి’ టీమ్‌లుగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా?

______________________

– మల్లు బట్టివిక్రమార్క, ఎమ్మెల్యే 

కాంగ్రెస్‌ సభా పక్ష నాయకులు

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole