ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతి!

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. ప్రతి ఏటా ప్రకటించే 30 మంది ఫోర్బ్స్ యువ జాబితాలో సిద్ధిపేట జిల్లా పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి స్థానం లభించింది. ఈమె మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె..లండన్లో స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో గ్లోబల్ మాస్టర్స్ లో డిగ్రీ పట్టా పొందిది. ప్రస్తుతం స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రిగింగ్ కంపెనీ కి సీఈఓ గా పనిచేస్తుంది. ఆమె ఆ కంపెనీకి సహవ్యవస్థాపకురాలు కూడా కావడం గమనార్హం.

కాగా వ్యాక్సిన్ పంపిణీలో కీర్తి కంపెనీ సాధించిన ఫలితం ఆధారంగా యువ ప్రతిభావంతుల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకుంది. ఈ విషయమై కీర్తి స్పందిస్తూ.. 24 ఏళ్లకే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.. ప్రజలకు సేవ చేసేందుకు త్వరలో సొంతంగా బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు కీర్తిరెడ్డి పేర్కొన్నారు

Optimized by Optimole