Nalgonda: చిరంజీవి _ రామ్ చరణ్ యువత అధ్వర్యంలో ఘనంగా చరణ్ జన్మదిన వేడుకలు..

RamcharanBirthday:   మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు నల్లగొండ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి . ఈ సందర్భంగా పట్టణంలోని  భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన  రక్తదాన శిబిరంలో.. పలువురు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

కార్యక్రమంలో భాగంగా  చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అలుగుబేల్లి రామిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి , రామ్ చరణ్   చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకావాలని సూచించారు.అలాగే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న  మెగా పవర్ స్టార్ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు  ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  మెగాస్టార్  మాదిరి రామ్ చరణ్  సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక  మంచి  చిత్రాలలో నటించి అలరింపజేయాలని అభిలాషించారు.

రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో   జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు అలుగుబేల్లి రామిరెడ్డి, రెడ్ క్రాస్ డైరెక్టర్ రిటైర్డ్ ప్రిన్సిపల్  నర్సిరెడ్డి , రామ్ చరణ్ యువత అధ్యక్షులు సురేష్ , పట్టణ అధ్యక్షులు ఎస్కే హైమద్ , ముఖేష్ , బన్నీసిరి , వెంకన్న ,సైదులు , శ్రీనివాస్ , నరేష్ , చిరంజీవి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Optimized by Optimole