అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణమే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళి!
Nancharaiah merugumala senior journalist: ఇందిరా గాంధీ హయాంలో వేళ్లూనుకున్న కుహనా సోషలిజాన్ని, రాజీవ్ గాంధీ పాలనలో బలహీన పడిన కుహనా లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పీకేసి ‘హిందూ’ మహాసముద్రంలో కలిపారు పాములపర్తి వేంకట నరసింహారావు గారు. ఈ తెలుగు అపర చాణక్యుడు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్లకు అంటే–19 సంవత్సరాల క్రితం 2004 శీతాకాలంలో కన్నుమూశారు. దక్షిణాదికి చెందిన ఒకే ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రిపై చరిత్ర తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది….