రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…
బాలీవుడ్ పై సోనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు..!!
సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.తన కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ మాఫియా గుప్పిట్లో ఉండటం వలన తనకు అవకాశాలు రాలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 2018లో క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న సోనాలి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..1990లో బాలీవుడ్‌ను అండర్‌వరల్డ్ తీవ్రంగా ప్రభావితం చేసిందని.. దానివల్ల తాను…
గుడ్ న్యూస్ చెప్పిన అలియా.. ఆనందంలో అభిమానులు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లి కాబోతుంది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హీరో రణ్ బీర్ కపూర్ తో అలియా వివాహం ఈఏడాది ఏప్రిల్ లో జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలియజేశారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని అలియా భట్.. ఆస్పత్రిలో స్కానింగ్ తీసిన ఫోటోలను ఇన్ స్టాలో పాపాయి రాబోతున్నాడు అన్న క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. ఈఫోటోలో…
దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..
దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 వేల 73 కేసులు నిర్థారణ అయ్యాయి. మహమ్మారితో 21 మంది చనిపోయారు. కరోనా నుంచి 15 వేల 2 వందల 8 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివవ్ కేసుల సంఖ్య 94 వేల 420 గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ…
మూసీ ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40వేల ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు తెరిచారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుడటంతో.. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1247 క్యూసెక్కులు వస్తుండగా..అవుట్ ఫ్లో 1992 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 644.61 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వలు సామర్థ్యం 4.46…