ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!
ఐపీఎల్ 15వ సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…