మోదీ బర్త్ డే..వరల్డ్ రికార్డు..!!
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు వరల్ రికార్డు నమోదైంది. దేశవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 87 వేల మంది రక్తదానం చేశారు. మోదీ మీద అభిమానంతో ..స్వయం సేవకులు.. కార్యకర్తలు.. అభిమానులు .. భారీ సంఖ్యలో రక్తదాన శిబిరంలో భాగస్వామ్యులు కావడం అభినందననీయమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రధానికి దేశం తరపును ఇచ్చిన గొప్ప బహుమతమని కొనియాడారు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ. రక్తదాన శిబిరాలు అక్టోబర్ 1 వరకు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.
సూర్యమండల స్త్రోత్రం!
సర్వ పాపాల్ని హరించి పుణ్యఫలం ప్రసాదించే సూర్యమండల స్త్రోత్రం. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య…
‘టీంఇండియా’ పై ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంపై అజట్టు టెస్ట్ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీయడం వలనే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందిని పైన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలో ఓడించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఓ…
అదిరింది కూన కూత..!
అబ్బో మొరాకో అంత తేలిగ్గా వదలలేదు. తుది ఫలితం 2-0 లా కనిపిస్తున్నా…. బోల్డు చమట కక్కితే గాని ఫ్రాన్స్ కి 60 ఏళ్ల చరిత్ర సృష్టించే చాన్స్ దక్కలేదు. చాంపియన్ కు ఏ మాత్రం తగ్గకుండా బంతిని నియంత్రించడమైనా, పాస్ లైనా, ఒడుపుగా బంతి కాళ్లచిక్కించుకోడమైనా, గోల్ పోస్ట్ పై దాడులైనా….వావ్ ఎంత ముచ్చటేసిందో! మొరాకో కూన గర్జనను ఫ్రెంచ్ గోల్ కీపర్ హ్యూగో లోరిస్ పలుమార్లు అడ్డుకొని, ఆ గొప్ప సేవ్స్ చేసుండకపోతే… చరిత్ర…
డ్రగ్స్ నిర్మూలన కై రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమం
యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ‘నయా సవేరా’ అనే మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు త్వరలో పునఃప్రారంభించనున్నారు. దీని విషయమై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఒక ప్రకటన చేశారు. కాగా యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు త్వరలో ‘నయా సవేరా’ అంటే ‘నయా డాన్’ అనే డ్రగ్స్ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. చిన్నారులు, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే…
క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్
ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…
సంక్రాంతి ముగ్గులు (ప్రత్యేకం )
సలివోజు తను శ్రీ : నల్లగొండ ,పాతబస్తీ (12 చుక్కలు.. 4వరుసలు.. 4వచ్చే వరకు)
