Karimnagar:భారత్ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ…

Karimnagar: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్ధికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్దంతి. ఈ…

Read Full News

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం..

సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేశ్‌ తల్లి ఇందిరాదేవి హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. వీరికి ఐదుగురికి సంతానం.కుమారులు రమేశ్‌బాబు, మహేశ్‌బాబుతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. కొద్దినెలల క్రితం రమేశ్‌బాబు కూడా అనారోగ్యంతో మృతిచెందారు. ఇప్పుడు ఇందిరాదేవి మృతితో మహేశ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన…

Read Full News

ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ షో ఇండియన్‌ ‘ఐడల్‌ సీజన్‌ 12’ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం…

Read Full News

Telangana: మోట కొండూరులో సేవ్ దామగుండం పేరిట నిరసన..

Telangananews:  వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి దామగుండ రక్షిత అడవులలో నౌకాదళ రాడార్ కేంద్ర ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర వివిధ సంఘాల నాయకులు, ప్రకృతి ప్రేమికులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవిలో జీవిస్తున్న స్థానికులకు, జీవరాసులకు, నగరవాసులకు ముప్పు పొంచి ఉందని,మూసి నది ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రచయిత పి.చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి,అటవీ…

Read Full News

Hyderabad: మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల బాగోతం…!!

Hyderabad:  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చార‌ని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడ‌లోని రెండు చిరునామాలలో వ‌రుస‌గా 32, 43 మంది ఓటర్లు, హైలం కాల‌నీలో అడ్ర‌స్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…

Read Full News

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read Full News

Chhatrapati Shivaji: శివాజీ హిందూత్వవాదా? లౌకికవాదా?

విశీ ( సాయి వంశీ) :  (AN IMPORTANT CASE YOU SHOULD KNOW) మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కొల్హార్ ప్రాంతానికి చెందిన గోవింద్ పన్సారేకు తన పాఠశాల ప్రాయంలోనే కమ్యూనిజంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఇష్టం, నమ్మకంగా మారింది. 1952లో సీపీఐలో ఆయన చేరారు. ఆపై అనేక పుస్తకాలు చదివారు. ఆ దశలోనే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం, గోవా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1962లో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. భారత్-చైనా యుద్ధ సమయంలో…

Read Full News

దేశంలో కాస్త తగ్గినా కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​​తో మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13 వేల 543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్ష 61వేల 555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read Full News
Optimized by Optimole