Rahulgandhi: ప్రియాంక- రాహుల్ మాదిరి..షర్మిల, జగన్ మధ్య ‘ అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..!
Nancharaiah merugumala senior journalist: ” ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారన్న రాహుల్.. ! షర్మిల, జగన్ మధ్య కూడా ఇలాంటి ‘అన్నాచెల్లెళ్ల అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..! “ చెల్లి ప్రియాంకపై అన్న రాహుల్ కు ఈ విశ్వాసం మార్చి 16కు ముందు ఉండి ఉంటే.. కాంగ్రెస్ లోక్ సభలో సెంచరీ మిస్సయ్యేది కాదేమో. తమ కుటుంబ ‘పాత సొంత’ నియోజకవర్గం అమేఠీలో కాంగ్రెస్ అభ్యర్ధి కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం…
సిఐడి మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ
సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల…
ప్రధాని మోదీ కిడ్డీ బ్యాంక్ విగ్రహాలూ..!!
ఓ శిల్పి ప్రధాని మోదీ రూపంతో ఉన్న కిడ్డి బ్యాంక్ విగ్రహాలు తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఈ విగ్రహాలూ ఎందుకు తయారు చేస్తున్నాడు? ఆ విగ్రహాలతో ఏమైనా ఉపయోగం ఉందా?డబ్బులు దాచుకొనేందుకు వీలుగా ఉండే మోదీగారి విగ్రహాలను తయారు చేస్తున్నాడు.. బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన శిల్పి జై ప్రకాష్. ప్రధాని మోదీ విగ్రహాలు మాత్రమే ఎందుకు తయారు చేస్తున్నారని ప్రశ్నంచగా.. పోయినేడాది దేశాన్ని, నికృష్ఠచైనా మహమ్మారి నుండి కాపాడడానికి గౌరవ ప్రధాని మోదీగారు దేశవ్యాప్త జనతా…
కరోనా థర్డ్ వేవ్ పై టెడ్రోస్ ఆందోళన!
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తితోపాటు జన సంచారం పెరగటం.. కొవిడ్ నిబంధనలు పాటించకపోవటం.. ఇంకా కొన్నిదేశాలకు టీకా అందుబాటులోకి రాకపోవటం వంటిని థర్డ్ వేవ్ కి కారణమని తేల్చింది. కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమందరం థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు…
బీజేపీ గూటికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఉప ఎన్నిక అనివార్యమేనా?
గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం…
రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్
మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…
‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’… జనసేన లక్ష్యం: నాదెండ్ల మనోహర్
Janasena: ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిపరంగా దూరం చేసి, అన్ని రకాలుగా వెనక్కు తీసుకువెళ్లిన వైసీపీ ప్రభుత్వ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. దీని కోసం కచ్చితంగా వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్నదే జనసేన అభిమతమన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై చర్చించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ…
RammohanNaidu: ‘ కింజరాపు ‘ ఓ వెలుగు కిరణం.
ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): తెలుగు రాజకీయ చరిత్రకు కింజరాపు ఎర్రన్నాయుడు చేసిన గొప్ప కాంట్రిబూషన్…. తనయుడు రాంమోహన్ నాయుడును, వారసుడిగా తన పరోక్షంలో అందించడం. తండ్రి సద్గుణాలన్నీ పుణికి పుచ్చుకున్న రాంమోహన్ నాయుడు రాజకీయంగా తనను తాను రూపుదిద్దుకుంటున్న తీరు, పొందిన పరిణతి, అలవర్చుకున్న సంస్కృతి, చిన్న వయసులోనే సాధించిన, సాధిస్తున్న ఘన విజయాలు చూడలేకపోవడం ఎర్రన్న (ఆత్మీయులు ఆయన్నలా పిలుచుకునేది) దురదృష్టం! కానీ, రామ్మోహన్ వంటి ప్రయోజకుడైన కొడుకును కని, పెంచి, పెద్ద…
