Bandisanjay: సిరిసిల్లలో దిగ్విజయవంతంగా సాగుతున్న సంజయ్ ప్రజాహిత యాత్ర..!
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు…