భూలోక స్వర్గం “జాపాలి తీర్ధం” ..! ఎక్కడో తెలుసా?
Japaliteerdham: తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికం,ఆహ్లాదకరం గానే ఉంటుంది.తిరుమల అడవుల్లో భూలోక స్వర్గం లాంటి ప్రాంతం జాపాలి తీర్ధం.తిరుమల కు 6 కి.మీ.దూరం లో అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్ధం లో వెలసిన ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. మనం అందరం తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ప్రతి సంవత్సరం వెళుతునేఉంటారు.కాని తిరుమల అతి దగ్గర లో ఉండే అతి చారిత్రక,ఆధ్యాత్మిక ప్రాంతం జాపాలి తీర్ధం చూసిన వారు తక్కువ మంది అనేచెప్పాలి….