మట్టి గాజులు ఆడవారికి అందమే కాదు ఆరోగ్యం..
Womenbangles: తెలంగాణలో మట్టి గాజుల సంస్కృతి అసాధారణం. అపూర్వం. వర్ణనాతీతం. తన కడుపున పుట్టిన బిడ్డ శ్రేయస్సు, క్షేమం ప్రతీ తల్లికి ముఖ్యం. తన బిడ్డ చక్కగా ఎదగాలి. ఎల్లవేళలా చల్లగా ఉండాలి. ఎలాంటి కీడు దాపురించ కూడదు. మారాజు యోగ్య తతో మనుగడ సాధించాలి. ఇందుకు మంచి మట్టి గాజులు ధరించాలి. అదీ సొంత డబ్బుతో కాదు. ఇద్దరు మగ బిడ్డల తల్లి నుంచి ఒకే ఒక కొడుకు, లేదా కూతురున్న తల్లి, నజరానా తీసుకోవాలి….
మీకు మగబిడ్డ ఒక్కరా, ఇద్దరా? ఎక్కడ చూసినా గాజుల ముచ్చటే ..!
Women bangles sentiment: ఈసంగతి మీకు తెలుసా..! ఒక్క మగ బిడ్డ ఉన్న తల్లి..ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలట , ఇద్దరు బాబులు ఉన్న తల్లి.. ఐదుగురు బిడ్డల తల్లితో గాజులువేసుకోవాలట.. అది కూడా సంక్రాంతి ముందేనట..లేదంటే ఏదో జరిగిపోతుందంటా..ఇదే సెంటిమెంట్ ప్రచారం ఆ నోటా..ఈ నోటా ఇప్పుడు రాష్ట్రమంతా వ్యాపించింది. తెలంగాణలో ఎక్కడా చూసినా ఇదే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ ఇద్దరు ఆడవాళ్లు కలుసుకున్నా..ఇదే ముచ్చట పెడుతున్నారట. మొత్తానికి…
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ఓటు బీజేపీకే!
తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన కేసీఆర్ ఆశలను వమ్ముచేస్తూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పుకు ఓటు వేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి రావడంతో బొటాబొటి ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 2018తో పోలిస్తే 2023లో బీజేపీ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఆ పార్టీ రాష్ట్రంలో క్రియాశీలకంగా మరబోతోందని చెప్పవచ్చు. వాస్తవానికి తెలంగాణలో మొదటి నుండి కేసీఆర్ ప్రభుత్వం…
అమ్మాయిలను ఎరగావేసే విష సంస్కృతి..అమెరికాలోనే కాదు ఇండియాలోనూ..!
Nancharaiah merugumala senior journalist: ” శక్తిమంతులు, సెలబ్రిటీలకు ఆడపిల్లలను ‘సమకూర్చే’ సంస్కృతి అమెరికాలోనే కాదు.. మన హైదరాబాద్, బెజవాడల నుంచి న్యూఢిల్లీ వరకూ విస్తరించి ఉంది!..1980లు, 90ల్లో కాంగ్రెస్ హైకమాండ్ అబ్జర్వర్లకు మరవలేని, మరపురాని ‘ఆతిథ్యిం’ “ వయసులో ఉన్న ఆడపిల్లలను డబ్బు ఎరవేసో, బెదిరించో లేదా మాయ మాటలతోనో లొంగదీసుకుని అధికారంలో ఉన్న నాయకులకు, సెలిబ్రిటీల దగ్గరకు పంపించే వ్యాపార–రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడకో లేదా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కో పరిమితమై లేదు. జాతీయ…
రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?
Nancharaiah merugumala senior journalist: ” ఇందిరమ్మ రాజ్యం ఊసెత్తకుండానే….మన దేశంలోనే రాజన్న రాజ్యం రావాలన్న షర్మిలకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం?” కాంగ్రెస్ ప్రతిపక్ష నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్–మేలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి (దేశంలోనే తొలిసారి) ‘ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దాం’ అనే నినాదాన్ని విజయవంతంగా వాడుకున్న విషయం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు తెలుసు. అలాగే 2023 నవంబర్–డిసెంబర్ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఎనుముల…