విమర్శలు సరే! వాస్తవాలనూ విస్మరిస్తారా?
శేఖర్ కంభంపాటి ( సీనియర్ జర్నలిస్ట్ ): ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి…