‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్‌ పంత్‌ తో పాటు హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో  ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (891 పాయింట్లు) .. మూడో స్థానంలో(878 పాయింట్లతో) మార్నస్‌ లబుషేన్‌.. నాలుగో స్థానంలో జో రూట్‌ (831 పాయింట్లతో) ఉన్నాడు. పాక్‌ స్టార్ ఆటగాడు బాబర్‌ అజమ్‌ మూడు స్థానాలు దిగజారి (736 పాయింట్లతో) 9వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ (724 పాయింట్లతో) 10వ స్థానంలో ఉన్నాడు.

Optimized by Optimole