దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చమురు ధరలు సెంచరీ దాటాయి.కాగా హైదరాబాద్ నగరంలో నెల రోజులు గడవకముందే లీటరు పెట్రోలుపై 6 రూపాయలకు మించి ధర పెరగడం సామన్యుల జీవితాలపై పెను భారంగా మారింది.
కాగా హైదరాబాద్‌లో ఈ నెల 1వ తారీఖున 106 రూపాయలున్న పెట్రోల్ ధర , అక్టోబరు 28వ తారీఖుకు 112 రూపాయల 64 పైసలకు చేరుకుంది. ఇక నిన్నటితో పోల్చుకుంటే నగరంలో డీజిల్ ధర కూడా స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ఈ రోజు డీజిల్ 105 రూపాయల 84 పైసలకు చేరుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో ఇంధనం ధరలను గమనిస్తే… కరీంనగర్‌లో పెట్రోల్ 112 రూపాయల 76 పైసలు, డీజిల్ 105 రూపాయల 95 పైసలు. నిజామాబాద్‌లో పెట్రోల్ 114 రూపాయల 35 పైసలైతే, డీజిల్ 107 రూపాయల 74 పైసలు. ఇక ఏపీలో ధరల్ని పరిశీలిస్తే, విజయవాడలో పెట్రోల్ 113 రూపాయల 80 పైసలుగా ఉంటే, డీజిల్ ధర 106 రూపాయల 41 పైసలుకు చేరుకుంది. గుంటూరులో నిన్నటితో పోల్చుకుంటే ఇంధనం స్వల్పంగా తగ్గింది. పెట్రోల్ 114 రూపాయల 28 పైసలుంటే… డీజిల్ 106 రూపాయల 86 పైసలు ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ 113 రూపాయల 18 పైసలైతే, డీజిల్ 105 రూపాయల 78 పైసలు.