పోలార్డ్ ‘సిక్సర్స్’ రికార్డ్!

వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడు ఆటగాడిగా పొలర్డ్ రికార్డు నెలకొల్పాడు. బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో స్పిన్నర్ ధనుంజయ వేసిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్సర్స్ గా మలిచి ఈ ఘనత సాధించాడు. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఈ ఘనత సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు.

టీ20 ప్రపంచకప్ _2007 లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్, ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్_ 2007 లో దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  హె ర్షెల్ గిబ్స్, నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వన్ బంగ్ బౌలింగ్లో ఒకే ఒవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డును నమోదు చేశాడు.

You May Have Missed

Optimized by Optimole