రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ : ప్రతిపక్షాలు

రాష్టప్రతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు గురువారం ప్రకటించాయి. సాగు చట్టాల వ్యతిరేకంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల వలన పంటల విక్రయం నిలిచిపోయిందని, దీని ప్రభావం ప్రజా పంపిణీ వ్యవస్థ పై పడుతుందని పేర్కొన్నారు.

ఇక చట్టాల ఆమోదంపై ఆజాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలను ఆమోదించిందని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే రోజు జరిగిన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నట్లు, ఈ కుట్రకు పాల్పడిన ఎవరైనా సరే వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Optimized by Optimole