Annamalai: అన్నామలై ఎందుకు ఓడిపోయారు?
సాయి వంశీ ( విశీ): ఆయనో ఇంటర్‌నెట్ సెన్సేషన్. మాజీ ఐపీఎస్ అధికారి. తమిళనాడు రాష్ట్రంలో కమలదళ అధ్యక్షుడు. ఆయన పేరు చెప్తే యూత్ అంతా ఉర్రూతలూగిపోతారు. దక్షిణాదిలో కమలదళానికి బలమైన యువశక్తి. తమిళనేలపై ఆ పార్టీకి ఆయనే వెన్నుదన్ను. అయినా ఎందుకు గెలవలేకపోతున్నారు? ఎందుకు ఎంపీ కాలేకపోతున్నారు? ఆయనే అన్నామలై. అన్నామలై కుప్పుసామి. 2024 ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి 1.18 లక్షల ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి చేతిలో ఓడిపోయారు….