Telangana: అయోధ్య, అలీగఢ్ కన్నా ఎక్కువ ‘సెన్సిటివ్’ అని నిరూపించిన ‘ కొడంగల్ ‘ గ్రామం లగచర్ల..!
Nancharaiah merugumala senior journalist: భోగమోని సురేశ్ అనే యువకుడికి ఎక్కడ లేని విస్తృత ప్రచారం!కలెక్టర్ కారద్దాలు పగిలితే కరంటు ఆగింది, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి! ఉత్తరాది, మణిపూర్‌తో పోల్చితే..తెలంగాణ సర్కారు ‘హైపర్ సెన్సిటివ్’ అయింది. తెలంగాణ రాష్ట్రం–వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై స్థానిక ఊళ్ల జనం జరిపిన దాడిలో ఒక్కరూ కన్నుమూయ లేదు. ఎవరి తలా పగల్లేదు. ఏ ఒక్కరి కాలూ విరగ…