మోదీ సభ సక్సెస్ కావడంతో కేసిఆర్ అండ్ కో టీంకి వణుకు: డాక్టర్ లక్ష్మణ్
BJPTelangana: ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జన సభ దిగ్విజయం కావడంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. రూ. 13,500 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా నష్టపోతామనే దురుద్దేశంతో జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తమది కుటుంబ పార్టీయేనని చెప్పుకుంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని నిరుద్యోగులు, పేద ప్రజలు, మహిళలు తమ కుటుంబ సభ్యులు కాదా? అని…