బిఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై బాంబ్ పేల్చిన ఎంపీ.. రేవంత్ దారెటు?

తెలంగాణ‌లో బిఆర్ఎస్- కాంగ్రెస్ క‌లిసి పోటిచేయ‌బోతున్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంట‌రిగా అధికారంలోకి రాద‌న్న‌ ఆపార్టీ ఎంపీ వ్యాఖ్యల్లో అంత‌రార్థం ఏంటి? సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత పొత్తు కోసం కాంగ్రెస్ అధినేత్రిని కలిసిందన్న  వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత‌? ఒక‌వేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే పీసీసీ చీఫ్ రేవంత్ దారెటు? తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీల పొత్తుల‌పై ర‌కర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అధికార బిఆర్ ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై కొద్ది రోజులుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో…

Read More

సీఎం ప్ర‌చార ప‌ద్దుపై ర‌గ‌డ‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార ప‌ద్దు పై నెట్టింట్లో తెగ చ‌ర్చ నడుస్తోంది. నిత్యం ప్ర‌ధాన మోదీ వ‌స్త్ర‌ధార‌ణ, ప్ర‌చారం పై కామెంట్ చేసే ముఖ్య‌మంత్రి.. త‌న ప్ర‌చార ప‌ద్దు సంగ‌తెంటి చ‌ర్చ‌ను నెటిజ‌న్స్ లేవ‌నెత్తారు. బ‌డ్జెట్లో ప్ర‌త్యేక అభివృద్ధి నిధి (ఎస్ డీఎఫ్‌)కు, ప్ర‌చార కోసం ఐఅండ్ పీఆర్ విభాగానికి భారీగా నిధులు కేటాయించ‌డంపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.  రాజ‌కీయ స్వ‌లాభం కోసం ఆయ‌న‌కున్న‌  విచ‌క్ష‌ణాధికారుల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌నం చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే…

Read More

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు: సంకినేని

సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి ఆత్మకూరు మండలంలోని శక్తి కేంద్రాలలో 28 కార్నర్ మీటింగ్ లు నిర్వహించబోతున్నట్లు తేల్చిచెప్పారు. శుక్రవారం బీజేపీ ఆత్మకూరు(S) మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో కేంద్ర…

Read More

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించడం సిగ్గు చేటు : బండిసంజ‌య్‌

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల మహిళలంటే బీఆర్ఎస్ కు అసహ్యమని, ముర్ము రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు యత్నించారన్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదని సంజ‌య్ గుర్తు చేశారు. తక్షణమే మహిళలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి…

Read More

కెసిఆర్ హామీలన్నీ నెరవేర్చారు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఎనిమిదేళ్ళ పాలన లో సీఎం కేసీఆర్.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ చెక్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. నియోజకవర్గ వ్యాప్తంగా 424 మంది లబ్దిదారులకు, 4కోట్ల 24 లక్షల చెక్ లను పంపిణీ చేశారు. తెలంగాణ తరహా అభివృద్ది దేశ వ్యాప్తం చేయడానికే టీ.ఆర్.ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారిందన్నారు. కళ్యాణ లక్ష్మి కోసం ఇప్పటి వరకు…

Read More

తమిళ గమళ్ల గవర్నర్‌ తో గొడవ తెలంగాణ వెలమ సమాజానికి అరిష్టమేమో!

Nancharaiah merugumala: (senior journalist) ……………………………………………………. తమిళ గమళ్ల (నాడార్‌ లేదా ఈడిగ లేదా గౌడ) కుటుంబంలో జన్మించిన తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు పదే పదే ఘర్షణకు దిగుతున్నారు. కాంగ్రెస్‌ కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ గవర్నర్‌ తమిళిసై. మొదటి నుంచీ కాషాయంతో సంబంధంలేకున్నా తర్వాత ఆ పార్టీలో చేరిన మంచి డాక్టర్‌ (గైనకాలజిస్ట్‌ ఆమె). ఆమె రాజ్యపాల్‌ గా హైదరాబాద్‌ వచ్చి మూడేళ్లు…

Read More

ఏదైనా…కాలపరీక్షకు నిలిస్తేనే..!!

తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామాలు… ఈ వారం రెండు రాజకీయ శిబిరాల్లో శీతాకాలంలోనూ వేడి పుట్టించాయి. మొదటిది, ఢల్లీిలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ కేంద్రకంగా జరిగిన నిర్ణయాలైతే, రెండోది బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ తొలి రాజకీయ సభ! ఉద్యమం నుంచి రాజకీయాలకు మళ్లిన టీఆర్‌ఎస్‌ తన 23 ఏళ్ల ప్రస్తానంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా మారింది. ఆ క్రమంలో… పెద్ద సభావేదిక నుంచి, కేంద్రంలో…

Read More

ఉచిత విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా : మంత్రి జగదీష్

సూర్యాపేట: తెలంగాణా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన 2023 డైరీ క్యాలెండర్ ను ఆయన శనివారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విద్యుత్ కాంట్రాక్టర్లతో పాటు యావత్ రైతాంగానికి ఎంతో దోహదపడుతుందన్నారు జ‌గ‌దీష్ రెడ్డి.సుదూర ప్రాంతాల నుండి ట్రాన్స్ఫార్మర్స్ ఇతర పరికరాలు సరఫరా చేసే భారం తప్పిందని గుర్తు చేశారు. కొత్త జిల్లాల…

Read More

తెలంగాణ CS రద్దుపై హైకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్షాలు..

సీఎస్ సోమేష్ కుమార్ ను తెలంగాణకు కేటాయించడాన్ని రద్దుచేస్తూ  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాయి. రాష్ట్ర విభజన తర్వాత DOPT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి, ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికమని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కేడర్  అధికారులను పక్కనపెట్టి…. ఏపీకి కేటాయించిన అధికారిని సీఎస్  పదవిలో నియమించడం ద్వారా సీఎం కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందారని సంజయ్  విమర్శించారు. అటు…

Read More

ఇంకా నాలుకెక్కని బిఆర్‌ఎస్‌ ….

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) దేశం మొత్తానికి విస్తరించే లక్ష్యంతో భారతరాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) గా రూపాంతరం చెందింది. అధికారికంగా పేరు మారిన దృష్ట్యా విషయాన్ని ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, శాసనసభా స్పీకర్‌ కార్యాలయాలకు, ఇతరత్రా అందరికీ తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దాటి పేరు ప్రజల్లోకి వెళుతున్న క్రమం ఇది. పేరు మార్పు ఎంతగా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళింది? అంతకన్నా ముందు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల శ్రేణుల్లో కొత్తపేరు (బిఆర్‌ఎస్‌) ఎంతగా మెదళ్లలో నాటుకుంది …?…

Read More
Optimized by Optimole