న‌కిరేక‌ల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశ‌తో క‌మ‌ల‌నాథులు..

తెలంగాణ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం న‌కిరేక‌ల్ లో రాజ‌కీయం వాడీ వేడిగా న‌డుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే  మ‌ధ్య వ‌ర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వ‌ర్గాల నేత‌లు టికెట్ త‌మ నాయ‌కుడికే వ‌స్తుదంటూ సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మ‌రోవైపు బిఆర్ ఎస్ – వామ‌ప‌క్షాల పొత్తు క‌న్వ‌ర్ఫ్మ్ కావ‌డంతో ..ఈసీటు వారి ఖాతాలోకి వెళ్తుంద‌న్న ప్రచారం జ‌రుగుతుంది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎవ‌ర‌న్న‌దానిపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ…

Read More

బిఆర్ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై బాంబ్ పేల్చిన ఎంపీ.. రేవంత్ దారెటు?

తెలంగాణ‌లో బిఆర్ఎస్- కాంగ్రెస్ క‌లిసి పోటిచేయ‌బోతున్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంట‌రిగా అధికారంలోకి రాద‌న్న‌ ఆపార్టీ ఎంపీ వ్యాఖ్యల్లో అంత‌రార్థం ఏంటి? సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత పొత్తు కోసం కాంగ్రెస్ అధినేత్రిని కలిసిందన్న  వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత‌? ఒక‌వేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే పీసీసీ చీఫ్ రేవంత్ దారెటు? తెలంగాణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది పార్టీల పొత్తుల‌పై ర‌కర‌కాల ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. అధికార బిఆర్ ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై కొద్ది రోజులుగా పొలిటిక‌ల్ స‌ర్కిల్లో…

Read More

రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి : ఏపీసీసీ గిడుగు రుద్ర‌రాజు

దేశంలో ఆర్ధిక భ‌ద్ర‌త‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారన్నారు. కోట్లాది రూపాయలు ఎగొట్టిన‌ వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారని ఆయ‌న ప్ర‌శ్నించారు.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదని గిడుగు తేల్చిచెప్పారు. కాగా సీఎం జగన్ కు రంగుల ఫోబియా పట్టుకుందని రుద్ర‌రాజు ఎద్దేవ…

Read More

సికింద్రాబాద్ సికింద‌ర్ ఎవ‌రు..?

హార్ట్ ఆఫ్ దిపాలిటిక్స్ గా సికింద్రాబాద్ రాజ‌కీయం న‌డుస్తోంది. మూడు ద‌ఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప‌ద్మారావుగౌడ్.. మ‌రోసారి సీటు నాదేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంటే.. కంచుకోట లష్క‌ర్ పై ప‌ట్టునిలుపుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. అటు కాంగ్రెస్ సైతం ఎట్టిప‌రిస్థితుల్లో సీటు గెలుచుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంది. ప్ర‌తిసారి విభిన‌త్వాన్ని చాటుకునే ల‌ష్క‌ర్ ఓట‌ర్లు.. రానున్న ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మొగ్గు చూపే అవ‌కాశ‌ముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..! సికింద్రాబాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప‌ద్మారావుగౌడ్ కొనసాగుతున్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా ఆయ‌న…

Read More

మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా ముషీరాబాద్ ..టికెట్ కోసం నేత‌ల క్యూ..

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మోస్ట్ క్రేజీఎస్ట్‌ స్థానంగా మారింది. ఇక్క‌డ పోటిచేయాల‌ని ప్ర‌ధాన పార్టీల‌ నేత‌లు.. సీనియ‌ర్ నేత‌ల కుమారులు.. ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఇటు అధికార పార్టీ నుంచి మ‌రోసారి పోటిచేయాల‌ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంటే.. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు.ఈరెండు పార్టీల‌కంటే బీజేపీలో ఆశావాహులు అధిక సంఖ్య‌లో ఉండ‌టంతో ఈసీటు కాక‌రేపుతోంది. ముషీరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠాగోపాల్ కొనసాగుతున్నారు. మ‌రోసారి…

Read More

ఆస‌క్తి రేకెత్తిస్తున్న రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం…

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ రాజ‌కీయం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నియెజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ కు వ్య‌తిరేకంగా బిఆర్ ఎస్ నేత‌ల వ్య‌వ‌హ‌రం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేత‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. గ్రేట‌ర్ లో ప‌ట్టున్న‌ బీజేపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దించి ల‌బ్ధి పొందాల‌ని భావిస్తోంది. ప్ర‌కాశ్ గౌడ్ మూడు ప‌ర్యాయాలుగా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను బురిడికొట్టించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే…

Read More

పరిగిలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు…

ప‌రిగి రాజ‌కీయం శ‌ర‌వేగంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఎవ‌రికి వారు టికెట్ కోసం ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఎమ్మెల్యేగా మ‌రోసారి గెల‌వాల‌ని మ‌హేష్ రెడ్డి ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంటే.. మేము సైతం టికెట్ రేసులో ఉన్నామంటున్నారు కొంద‌రు బిఆర్ ఎస్ నేత‌లు. కాంగ్రెస్ లో సైతం ఇలాంటి ప‌రిస్థితి క‌నిపిస్తుంటే.. అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై బీజేపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంది. బిఆర్ ఎస్ లో వ‌ర్గ‌ పోరు… కాగా ప‌రిగి బిఆర్ ఎస్ లో నేత‌ల…

Read More

హుజుర్ న‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం..!!

హుజూర్‌నగర్ లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు నువ్వా- నేనా త‌ర‌హాలో మాట‌ల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు సేవా కార్య‌క్ర‌మాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెర‌పైకి రావ‌డం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు ర‌స‌కంద‌కాయంగా ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. ద‌మ్ముంటే త‌న‌పై పోటిచేయాల‌నిఎమ్మెల్యే…

Read More

దేవ‌ర‌కొండ బ‌రిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవ‌రు ?.. ప్ర‌తిప‌క్ష అభ్య‌ర్థి ఎవ‌రు ?

తెలంగాణ‌లో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖ‌రారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా క‌లిసిన ఈరెండు పార్టీలు.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటిచేయ‌నున్నాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ‌ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు  కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నిక‌ల్లో రెండు లేదా మూడు సీట్ల‌లో ఆపార్టీ అభ్య‌ర్థులు పోటి చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేత‌లు ఇప్ప‌టికే కార్య‌చ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా అధికార…

Read More

కౌన్ బ‌నేగా న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ న‌ల్ల‌గొండ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మ‌రోసారి ఎమ్మెల్యేగా గెల‌వాల‌ని సిట్టింగ్ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్ రెడ్డి అభివృద్ధి కార్య‌క్ర‌మాల పేరిట దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుంటే.. ప‌క్క‌లో బ‌ళ్లెంలా సొంత పార్టీ నేత‌లే టికెట్ రేసులో మేమున్నామంటూ సేవా కార్య‌క్ర‌మాల పేరుతో గ్రామ‌గ్రామాన విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక ప్ర‌తిపక్ష బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ నేత‌లు తామేమి త‌క్కువ కాదన్న త‌ర‌హాలో స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. బిఆర్ఎస్ లో గ్రూపు త‌గాదాలు… అధికార…

Read More
Optimized by Optimole