మూడింట రెండొంతులు ఇంకా బాకీ..!
కొన్ని సంవత్సరాల తర్వాత దేశ ప్రజల దృష్టిని బాగా ఆకర్శించిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యక్రమం ‘భారత్ జోడో’ యాత్ర ముగిసింది. పార్టీ ముఖ్య నాయకుడు, దేశానికి ముగ్గురు ప్రధానమంత్రుల్ని ఇచ్చిన కుటుంబపు వ్యక్తిగా రాహుల్ గాంధీ ఒక పరీక్ష నెగ్గారు. నిందో, నిజమో తెలియకుండా… ఇన్నాళ్లు రాహుల్ పై ఉన్న ఒక విమర్శ తొలగిపోయి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్ఠ పెరిగింది. ఆయన స్వభావం, వ్యవహార శైలిలోనూ కొంత మార్పు కనిపిస్తోంది. ఇదే క్రమంలో మరో రెండు…