Headlines

BJPTelangana: బండికి ప్రమోషన్.. అరుణకు మరోసారి అవకాశం..!

BJPTelangana:  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణకు రెండో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌ను రెండోసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు అరుణ్‌ సింగ్‌ నేతల నియమాకాలకు…

Read More

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై బీజేపీ ధర్నాలు

BJPTelangana: డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని ధర్నాలు, ఆందోళనల్లో నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రజల్ని మోసం చేశారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమీపించడంతో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్…

Read More

2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని…

Read More

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూపై బీజేపీ ఫైర్.. యాదాద్రి నర్సన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్..!!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ వస్తున్న ప్రచారంపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే తెలిసే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. మొత్తం వ్యవహారానికి ఢిల్లీ కేంద్రంగా కథ , స్క్రీన్ ప్లే కేసీఆర్ రచించారని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈవిచిత్ర డ్రామా వెనక నిజాలు ఎంటో తెలవాలంటే ప్రగతిభవన్ మూడు రోజుల సీసీ ఫుటేజీ చూస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు. ఈవిషయంలో…

Read More

ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…

Read More

రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ అటాక్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నారన్న అక్కసుతో రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీనేతలు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రేవంత్ చేసిన ఆరోపణల వీడియో క్లిప్పింగ్స్ చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. నేడు తెలంగాణ తల్లి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ భాష మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.  …

Read More

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ నేతలు . బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. నేతల మధ్య కోలాహాలంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలను అంతమొందించడానికి ..ప్రతి…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

బండి సంజయ్ అరెస్ట్ పై దుమారం!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తీవ్ర దుమారం రేపుతోంది. ఈనేపథ్యంలో అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు. పోలీసులు ఎంపీ క్యాంపు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించ‌డ‌మే కాకుండా డోర్లు ప‌గ‌ల గొట్టడం, గ్యాస్ క‌ట్టర్లు, రాడ్లు వినియోగించ‌డంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క‌రోనా నిబంధన‌ల‌కు అనుగుణంగా జాగ‌రణ చేస్తుంటే.. పోలీసుల‌కు, ప్రభుత్వంకు వ‌చ్చిన ఇబ్బంది ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా బండి సంజయ్ అరెస్టు, తాజా రాజకీయ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించారు బీజేపీ…

Read More

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్…

Read More
Optimized by Optimole