EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?

Nancharaiah merugumala senior journalist: హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే? తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని…

Read More

Cartoons: ‘ఇంటెలెక్చ్యుల్‌ ప్రాపర్టీ రైట్స్‌’ను తెలుగు రాజకీయ కార్టూనిస్టులు కాపాడడం శుభ పరిణామం..!

Nancharaiah merugumala senior journalist: ‘స్త్రీల శరీర భాగాలు మగాళ్లకు బిగించిన’ రాజకీయ కార్టూన్లు ఇప్పుడు ‘ఈనాడు’లో కనపడకపోవడం ‘పాత తరం’ పాఠకులకు లోటేనా? ‘ఈనాడు’లో క్రమం తప్పకుండా మొదటి పేజీలో దర్శనమిచ్చిన ‘స్త్రీల రొమ్ములతో’ వేసిన పురుష నేతల కార్టూన్లు ఇప్పుడు కనపడడం లేదు! మూడు దశాబ్దాలకు పైగా బర్రె లేదా దున్నపోతుపై స్వారీ చేసే బిహార్‌ యాదవ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్‌తో 1990–2020 మధ్య 30 ఏళ్ల పాటు గీసిన బొమ్మలూ అగపడవు….

Read More

EEnadu: తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!

Nancharaiah merugumala senior journalist: 1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది… 1974 చివర్లో కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్‌ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు….

Read More

EENADU: ‘ఈనాడు’ అక్షరం, రేపటికి గవాక్షం..!

ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: యాభయ్యేళ్లు, అంటే… అర్థశతాబ్ది చరిత్ర ఈ మూడక్షరాలు! ఈనాడు తెలుగు సమాజంతో అయిదు దశాబ్దాలు నిండుగా మమేకమైన దినపత్రిక. సమాచారం, సందేశం, జ్ఞానం, వినోదం, వికాసం, చేతన, ప్రేరణ, సంస్కృతి, సహాయం, సాహిత్యం, భాష, బంధం…. ఒకటేమిటి? ఇలా లెక్కలేనన్ని విధాలుగా తోడ్పడుతూ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకున్న అక్షరాల అనుబంధం ఈనాడు. దీర్ఘకాలిక వ్యూహం, పక్కా ప్రణాళికతో… యాబై యేళ్ల కింద, సరిగ్గా ఇదే తేదీ (ఆగస్టు 9)న,…

Read More

Eenadu: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే వారి బుర్రలు విచ్చుకుంటాయి?

Nancharaiah merugumala senior journalist: ‘ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష భాషే కాదు’ అనే అయ్యలసోమయాజుల, అప్పాజోశ్యుల శర్మలను ఏంచేస్తే వారి బుర్రలు విచ్చుకుంటాయి? ‘‘ ఈనాడు ఉద్యోగం ఉద్యోగం కాదు. ఈనాడు భాష అసలు భాషే కాదు. ఈనాడు గుమాస్తాలను తయారు చేసే కర్మాగారం. నేనూ ఆ గుమాస్తాల్లో ఒకడిని,’’ అంటూ సీనియర్‌ అవిశ్రాంత జర్నలిస్టు ఏఎన్‌ జగన్నాథ శర్మ గారు మొన్నీ మధ్య నా ‘ఉదయం’ మిత్రుడు ఎగుమామిడి అయోధ్యా రెడ్డి…

Read More

Nariman: న్యాయవాది ‘నారీమన్‌ ‘ మరణ వార్తకు ఈనాడులో కవరేజీ వెనక ఇంత కథ ఉందా?

Nancharaiah merugumala senior journalist:  ( నారీమన్‌ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం!  ) ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్‌ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్‌ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70…

Read More

Lifetimeachievement: విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే’ హెచ్చార్కే చాలా మందికి గుర్తు!

Nancharaiah merugumala senior journalist: (ఉదయంలో కొద్ది మాసాలు, ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినా ..‘విమోచన’ ఎడిటర్‌–ప్రచురణకర్తగానే హెచ్చార్కే చాలా మందికి గుర్తు!) =============== ఎంత కాదని చెప్పినా… ఏదైనా అవార్డు ప్రకటించినప్పుడు దానికి ఎంపికైన వ్యక్తిపై కొద్ది రోజులు చర్చ నడుస్తుంది. 2023 సంవత్సరానికి మీడియా విభాగంలో జీవనకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైన ఇద్దరిలో ఒకరైన హెచ్చార్కే గారు (కొడిదెల హనుమంత రెడ్డి) ఎక్కువ మందికి కవిగా, పాత్రికేయుడిగా తెలుసు. తెలుగు కవిత్వం లోతుపాతులు పెద్దగా అర్ధంగాని…

Read More

కృష్ణా కమ్మలను…కడప రెడ్లను మాజీ ఎంపీ కంగారు పెడుతున్నారా?

Nancharaiah merugumala(senior journalist) ……………………………………………….. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గారు పేరు చెప్పగానే… కృష్ణా జిల్లా కమ్మ కుటుంబ మూలాలున్న మీడియా వ్యాపారి చెరుకూరి రామోజీరావు గారు రంగారెడ్డి జిల్లా అనాజ్‌ పూర్‌ గ్రామంలో సరిగ్గా 16 ఏళ్ల క్రితం కంగారు పడిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం వైఎస్సార్సీపీ ఎందుకో మరి ఉండవల్లి గారి సూటిపోటి తాజా మాటలకు జవాబు చెప్పాలని భావించింది. అంటే, కృష్ణా జిల్లా కమ్మలే కాదు, కడప…

Read More

మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…

Read More

‘ఈనాడు’ కొత్త తెలుగు మాటలు కనిపెట్టే కంటే పాత తెలుగు పేర్లు నేర్పిస్తే మేలు!

Nancharaiah merugumala (senior journalist): గర్భ విచ్ఛిత్తికి బదులు ‘కడుపు తీయించుకోవడం’ అనే మాట వాడకూడదా? ––––––––––––––––––––––––––––––––––––––––––– గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావానికి బదులు తెలుగునాట జన సామాన్యం వాడుక మాట– కడుపు తీయించుకోవడం– పత్రికల్లో, టీవీ చానళ్లలో వాడకూడదా? మమూలు మనుషులు పలికే ‘కడుపు తీయించుకోవడం’ అనే మాటలు అబార్షన్‌ లేదా గర్భస్రావం మాదిరిగానే పెళ్లయినవారికి, అవివాహితులకు కూడా వర్తించేలా వాడుకుంటున్నారు. సిజేరియన్‌ సెక్షన్‌ (సీఎస్‌) ఆపరేషన్‌ కు కత్తెర కాన్పు అని పెద్ద తెలుగు పత్రిక…

Read More
Optimized by Optimole