కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై.. షాక్లో అభిమానులు!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కొహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన బీసీసీఐతోపాటు.. సీనియర్లకు థ్యాక్స్ చెప్పారు. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని ట్వీట్ చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోల్పోయిన వెంటనే కొహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఏడేళ్ల పాటు కెప్టెన్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. అండగా…