KCR: కేసీఆర్ వ్యూహంతో ఫలితం దక్కేనా?
Telangana politics: రాష్ట్రంలో రాజకీయాలు….. శీతాకాలపు చలిని మరిపించేంత వేడి పుట్టిస్తున్నా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మౌనమే పాటిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గతంగా మాట్లాడుతున్న అంశాల సారాంశం మాత్రం బయటకు వస్తోంది. ఇటీవలే… పాలకుర్తి నియోజకవర్గం వారితో మాట్లాడి, పంపిందీ అటువంటి సందేశమే! చాన్నాళ్లుగా ఆయన పాటిస్తున్న మౌనం వెనుక ఏముంది! అది వ్యూహాత్మక ఎత్తుగడా? రాజకీయ వైరాగ్యమా? జనం మెదళ్లను ఈ ప్రశ్న తొలుస్తోంది. ఇదుగో ఇప్పుడొస్తారు, అదుగో అప్పుడొస్తారు,…